మట్టి దందాపై పరిశీలన

May 23,2024 23:34 #Anandapuram, #danda, #matti
Anandapuram, matti

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలంలోని భీమన్న దొరపాలెం పంచాయతీ కోలవానిపాలెం, పప్పలవానిపాలెం చెరువు, పొలాలలో ‘యథేచ్ఛగా మట్టి దందా!’ శీర్షికన ప్రజాశక్తిలో గురువారం ప్రచురితమైన కథనానికి రెవెనూ, మైనింగ్‌ అధికారులు స్పందించారు. మైనింగ్‌ డిపార్ట్‌మెంటు ఆర్‌ఐ సిహెచ్‌. ఆంజనేయులు ఆధ్వర్యాన టెక్నికల్‌ అసిస్టెంట్‌ శైలజ సుభాని, స్థానిక విఆర్‌ఒ ప్రియానంద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మట్టి ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. మట్టిని రెండు రోజుల నుంచి రెండు జెసిబిలు తవ్వి, లారీలతో రవాణా చేసి ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 250 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీసుకెళ్లినట్లు గుర్తించి స్థానిక రెవెన్యూ అధికారులకు రిపోర్ట్‌ అందిస్తామ మైనింగ్‌ ఆర్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

➡️