మినీ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం

గాలివీడు (అన్నమయ్య) : మినీ అంగన్వాడీ కేంద్రంలోని 4 సంవత్సరాల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన గాలివీడు మండలం కమాలమర్రి గ్రామంలో జరిగింది. అంగన్వాడి టీచర్‌ సుబ్బలక్ష్మి కి వఅద్ధుడు కొర్రపోతుల రెడ్డెయ్య (55) బావ అవుతాడు. రెడ్డెయ్య అంగన్వాడీ కేంద్రంలో ఉన్న 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని చికిత్స కోసం వెంటనే రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ పాపకు అన్యాయం జరిగిందంటూ చిన్నారి తల్లిదండ్రులు రోదించారు. అధికారులు స్పందించి నిందితుడిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️