బచ్చలమల్లి సినిమా షూటింగ్‌

Jan 27,2024 23:58
లొకేషన్‌ పరిశీలిస్తున్న దర్శకుడు సుబ్బు ,చిత్ర బందం

ప్రజాశక్తి- నక్కపల్లి:హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై అల్లరి నరేష్‌, అమృత అయ్యర్‌ (హనుమాన్‌ ఫేమ్‌) హీరో హీరోయిన్‌లుగా తెరకెక్కిస్తున్న బచ్చలమల్లి సినిమా షూటింగ్‌ రెండవ షెడ్యూల్‌ నక్కపల్లి మండలం ఉపమాక, నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలలో చిత్రీకరణ చేయనున్నట్లు చిత్ర దర్శకుడు బి.సుబ్బు మంగాదేవి తెలిపారు .చిత్ర టెక్నీషియన్‌ బృందంతో కలిసి శనివారం ఆయన నక్కపల్లి, ఉపమాక పరిసర ప్రాంతాల్లో లొకేషన్‌ లను పరిశీలించారు. నక్కపల్లిలో నూకాలమ్మ ఆలయం, ఉపమాకలో వెంకన్న ఆలయం, చెరువు ,ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేం దుకు నక్కపల్లి నూకాలమ్మ ఆలయం, ఉపమాక ఆలయ పరిసర ప్రాంతాలు అనువుగా వున్నట్టు చిత్ర యూనిట్‌ గుర్తించిందన్నారు. ఫిబ్రవరి నెలలో ఈ ప్రాంతంలో చిత్ర చిత్రీకరణ చేపడతా మన్నారు.ఈ చిత్రానికి నిర్మాత రాజేష్‌ దండా, కెమెరామెన్‌ రిచర్డ్‌ నాథన్‌ ,స్క్రీన్‌ ప్లే రైటర్‌ మధు విప్పర్తి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌ చంద్రశేఖర్‌ (సీతారామ ఫేమ్‌ ), ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మ కడలి, కో డైరెక్టర్‌ నాగిరెడ్డి, మేనేజర్‌ చంద్రశేఖర్‌, డైరెక్షన్‌ డిపార్ట్మెంట్‌ ఒనుముల బుచ్చిరాజు వ్యవహరిస్తున్నారని, దసరాకు సినిమా విడుదల చేస్తామని తెలిపారు.

➡️