వాడవాడలా కొవ్వొత్తుల ప్రదర్శనలు

vలంకెలపాఎలంలో కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, నాయకులు

 

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె ఉధృతంగా మారుతోంది. గత ఎన్నికల్లో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్‌వాడీలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ని పలు చోట్ల ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శలు చేపట్టారు. మరికొన్ని చోట్ల కొలాటంతో నిరసనను తెలియజేశారు. నక్కపల్లి:తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడి వర్కర్స్‌ చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది .మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో ఏర్పాటుచేసిన రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద ప్రభుత్వ వైఖిరిని నిరసిస్తూ అంగన్వాడి వర్కర్స్‌ కోలాట ప్రదర్శన చేశారు.తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడ సరికాదని అంగన్‌వాడీలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతలు వారికి ఎలా తెలుసునని ప్రశ్నించారు.తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 13 రోజుల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సమస్య పరిష్కారానికి మార్గం చూపకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తమ పట్ల మొండివైఖిరిని ప్రదర్శిస్తుందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి, యూనియన్‌ నాయకులు కవిత, లక్ష్మీ రాజ్యం, మంగ లక్ష్మీ, రమణమ్మ, జయ, ఆర్‌వికె లక్ష్మీ పాల్గొన్నారు.పరవాడ: మండలంలోని లంకెలపాలెం కూడలిలో ఆదివారం సాయంత్రం అంగన్‌వాడీలు కొవ్వుత్తులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో అంగన్‌వాడీలకు మద్దతుగా లబ్ధిదారులు పాల్గొన్నారు. న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. భేషజాలకు పోయి బెదిరింపు చర్యలకు దిగడం మానుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేయకపోవడం విచారకరమన్నారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు రమణి తదితరులు పాల్గొన్నారు.పరవాడ మండలం గొర్లివానిపాలెం పాలెం పంచాయతీ బసవతారక కాలనీ కొవ్వొత్తుల ప్రదర్శనలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గనిశెట్టి మాట్లాడుతూ, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదని, తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేసి సమ్మెను విరమింపజేయాలని కోరారు. అంగన్వాడీలతో పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీయూనియన్‌ నాయకులు సిహెచ్‌ దేవి, కె.లక్ష్మి, జి భవాని, బి. జానకి, లబ్ధిదారులు బి శాంతిలక్ష్మి, డి మంగ, కె.స్వాతి, జి శిరీష, కే లక్ష్మి, ఎంఏ దేవి, కే ఉమా, పి పావనిపాల్గొన్నారుబుచ్చయ్యపేట : అంగన్వాడీల యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అంగన్వాడీలు వెలిగించిన కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు.ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాన్ని పెంచాలని ఇతరసమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. నిరసనలో అంగన్వాడీలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారువడ్డాది: వడ్డాదిలో అంగన్‌వాడులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ 13రోజుల నుండి సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి కనబడ లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో డ్వాక్రా విఒ సుంకర చిట్టెమ్మ, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. కోటవురట్ల: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని గడిచిన 13 రోజులుగా అంగన్వాడీలు చేపడుతున్న దీక్షలు మండల కేంద్రంలో ఆదివారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, తక్షణమే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మునగపాక : అంగన్వాడీల సమ్మెలో భాగంగా ఆదివారం రాత్రి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కొవ్వొత్తులను వెలిగించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో హేమలత, సరస్వతి, ఉమాదేవి, బి రేవతి పద్మ, శివ గణేష్‌ అమ్మ, లక్ష్మి ,సత్యవతి, కుమారి, లక్ష్మి పాల్గొన్నారు.కశింకోట: అంగన్వాడీ సమ్మె దీక్షలో భాగంగా కశింకోటలో అనకాపల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. లబ్ధిదారులు సంఘీభావం తెలిపి పాల్గొన్నారు. కార్యక్రమంలో యు. సత్యవతి, ఎస్‌. వెంకటలక్ష్మి , పి.సత్యవేణి, ఎస్‌. ఉమా, బాలబాలికలు పాల్గొన్నారు. యూనియన్‌ నాయకులు తనుజ, శ్యామల, కుమారి, ఐద్వా జిల్లా నాయకురాలు డిడి.వరలక్ష్మి , సిఐటియు. జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.సబ్బవరం: అంగన్వాడీల సమ్మెదీక్షల్లో భాగంగా వెలిగించిన కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వి.వి.రమణమ్మ, ఎం.వరలక్ష్మి, పుష్ప, జగదీశ్వరి, వి. సుభాషిణి, ఎం. కనకమ్మ,జి. అరుణ కుమారి,ఎస్‌. రమణమ్మ, డి. భారతి, ఎ. రమణమ్మ, పి. సూరమ్మ, ఎన్‌. సత్యవేణి పాల్గొన్నారు.రాంబిల్లి: మండలంలోని కొత్తపట్నం, కొత్తపేట గ్రామాలలో అంగన్వాడీలకు మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి దేవుడ నాయుడు, డివైఎఫ్‌ఐ నాయకులు, నారాయణరావు, శ్రీను, ధనరాజ్‌, దుర్గారావు, ఎన్‌ఎఒబి కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఆశ కార్మికులు, మహిళలు అంగన్వాడీ లబ్ధిదారులు పాల్గొన్నారు.నక్కపల్లి:అంగన్వాడి వర్కర్స్‌ పై ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపారు. అంగన్వాడి చిన్నారులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అంగన్వాడి వర్కర్స్‌ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి , అంగన్వాడీ కేంద్రాలు తెరిచే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారువిశాఖ కలెక్టరేట్‌ : జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీలు ఒంటి కాలిపై నిల్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. వారినుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా బలవంతంగా తాళాలు బద్దలు కొట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంగన్‌వాడీల పోరాటానికి సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ఐద్వా, పిఒడబ్ల్యు, వీరమహిళ, విద్యార్థి, యువజన, న్యాయవాదుల సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు వై.తులసి, ఇందిర, ఈశ్వరమ్మ, రత్నం, వెంకటలక్ష్మి, శోభారాణి, నాగేశ్వరి, ఉమ, శ్రీదేవి, శ్యామలాదేవి, రాజేశ్వరి పాల్గొన్నారు. పెందుర్తి : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్బంగా ఐద్వా నగర ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ, జగన్‌ పాలన నియంతలా ఉందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి.జగన్‌, ఐద్వా నాయకులు బి.అనంతలక్ష్మి, అంగన్‌వాడీ రాష్ట్ర యూనియన్‌ ఉపాధ్యక్షులు బృందావతి, భవానీదేవి తదితరులు పాల్గొన్నారు. భీమునిపట్నం : ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జివిఎంసి మూడో వార్డు పరిధి తోట వీధి, మండలంలోనికృష్ణంరాజుపేట, మజ్జివలస, ఆశిపాలెంలో అంగన్‌వాడీలు లబ్ధిదారులతో కలిసి ఆదివారం రాత్రి ఆయా అంగన్‌వాడీ కేంద్రాల వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆనందపురం మండలం, పాలవలస అంగన్‌వాడీ కేంద్రం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు భీమిలి జోన్‌ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. గాజువాక : అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాత గాజువాక నుంచి కొత్తగాజువాక వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నమ్మలు, జ్యోతి, సాయి సరస్వతి, వేణుశ్రీ, సుజాత, సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు, కోవిరి అప్పలరాజు, ఎం.రాంబాబు, ఐద్వా నాయకులు లక్ష్మి పాల్గొన్నారు

➡️