3వేల లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం

Mar 29,2024 12:41 #anakapalle district

ప్రజాశక్తి-దేవరాపల్లి : మండలంలోని రైవాడ జలాశయం సమీపంలో గల బొడ్డపాడు ప్రాంతంలో స్థానిక ఎస్సై డి.నాగేంద్ర తన సిబ్బందితో కలిసి నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 3 వేల 500 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు. నాటు సారా తయారీకి ఉపయోగించిన 15 ప్లాస్టిక్ డ్రమ్ములను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగేంద్ర శుక్రవారం తెలిపారు. ఎవరైనా నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అన్నారు.

➡️