జన సముద్రంగా నర్సీపట్నం

Dec 18,2023 16:53 #anakapalle district
akp anganwadai strike continue 7th day

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో నర్సీపట్నం ప్రధాన రహదారులు ఎర్ర జెండాలతో జన సముద్రంగా మారింది. 7వ రోజు నిరసన లో భాగంగా ఆర్‌డిఓ కార్యాలయం వద్ద సోమవారం దర్నా విజయవంతం చేసారు. ప్రభుత్వం స్వందించ కుంటే ఉద్యమం ఉదృతం చేస్తామని సిఐటియ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక ఎల్‌ఐసి కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయంవరకు నినాదాలతో బ్యారీ ర్యాలి గా వచ్చి కార్యాలయంలో బైటాయించి దర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హమీలు మరచి, సమ్మెలో ఉన్నవారిని బెదిరించి, బయబ్రాంతులకు గురిచేసి సమ్మేను విచ్చినం చేసేందకు కృట్రజేస్తుంది అన్నారు. అంగన్‌వాడీలుల గొంతమ్మ కొరికలు కొరడం లేదు, కనీసవేతనాలు, గ్రాడ్యూటీ అమలంటున్నారు. అలాగే ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాతూ పేద ప్రలకు సేవలందీస్తున్న అంగన్‌వాడీలను వైసిపీ ఎమ్మేలలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నోరు అదుపు లేకపోతే తగిన బుద్ధి చెప్పతాము అని హెచ్చరించారు. ఒకసారి ఎమ్మేలే, ఎంపీ అయ్యయితే జీవితాంతం 50వేలు పెన్షన్‌ పొంతున్నారు. కాని 50 ఎళ్ళ సేవలందీస్తున్న అంగన్‌వాడీలకు పెన్షన్‌ ఇవ్వరా అని అడుగుతున్నాము అన్నారు. అలాగే ఐద్వా రాష్ట్ర అద్యాక్షులు బి. ప్రభావతి మాట్లాడుతూ దేశంలో రక్తహీనత, శిషుమరణాలు తగ్గినా, అక్షర్యాసిత పెరిగినవి అంటే అందుకు అంగన్‌వాడీల సేవలే కారణం. అలాంటి అంగన్‌వాడీలపై జగన్‌ మోహన్‌ కక్షశాంది చర్యలు మానుకొవాలన్నారు. ఈ సందర్భంగా ఎపి అంగ్‌వాడి వర్క్స్‌ &హెల్పర్స్‌ యూనియన్ జిల్లా అద్యాక్షలు దుర్గారాణి, కాంగ్రీసు పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షలు మీశాల సుబ్బన్నా, నాన్‌ షెడ్యూల్ గిరిజన సంఘం జిల్లా నాయకులు కె. గోవింద్ తదితరులు మాట్లారు. ఈ కార్యక్రమలో వి.సామ్రాజ్యం, మహలక్ష్మీ,  సిహెచ్ బ్రమరాంబ, మంగ, పద్మజా, కృష్ణవేణి, సిఐటియ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, నర్సీపట్నం మండల కన్వీనర్‌ టి.ఈశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

➡️