దిబ్బిడిలో బుద్ద పౌర్ణమి వేడుకలు

May 23,2024 13:51 #anakapalle district

ప్రజాశక్తి – బుచ్చయ్య పేట (అనకాపల్లి జిల్లా) : మండలంలో గల దిబ్బిడిలో బుద్ద పౌర్ణమి వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దుని విగ్రహనికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ గో న్నాబత్తుల శ్రీనివాసరావు మాట్లాడుతూ బుద్ధుని బోధనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. శాంతి సహనంతో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ముమ్మిన నాగరాజు, మండల తెలుగు యువత అధ్యక్షులు సానాపతి మణికంఠ, గంట సన్యాసి నాయుడు, పెద్దరెడ్ల మాణిక్యం పెద్దిరెడ్డి జగన్,గొంపా అప్పల నాయుడు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️