రైవాడ నీరు రైతులకా! అదానికా! తేల్చండి

Feb 9,2024 11:31 #anakapalle district
cpm on raivada water supply

ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలునాయుడుకు సిపిఎం ప్రశ్న 

ప్రజాశక్తి-దేవరాపల్లి : ఇకపై రైవాడ నీళ్ళు రైతులుకా! అదానికా! తేల్చవలసింది ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలునాయుడేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం అయిన ఓ ప్రకటన విడుదల చేసారు రైవాడ ప్రాజెక్టుకు ఆధాని కచ్చిఫ్ వేసేసాడు అధానీ పేరు ముందు పెట్టకుండా నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థలి, “(NREDCAP) న్యూ రేనేబుల్ ఎనర్జ్ డెవలాఫ్మేంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ పేరుతో పంపుడు (లిఫ్టు) స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఫేస్-III కింద నిర్మించి 1000 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకుగాను ఆధాని 2022లో విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సమ్మెట్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో MOU కుదుర్చుకున్నారు. ఈ MOUలో రైవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు చోట్ల లిఫ్టు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించేందుకు ఒప్పందాలు కుదిరాయి.
1) రైవాడ : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం విజయనగరం-జిల్లా వేపాడ మండలం సరిహద్దులలో 1000 మెగావాట్లు

2) పెదకోట రేగుల పాలెం వద్ద,, అల్లూరి జిల్లాలో రైవాడ ప్రాజెక్టు నీళ్ళు వచ్చే గెడ్డపై 1500 మేగావాట్లు,
3) గుజ్జిలి : విజయనగరం – పార్వతపురం మన్యం జిల్లాల సరిహద్దులో1400 మేగావాట్లు
4) చిట్టం వలస : అల్లూరి సీతారామరాజు జిల్లా 800,మేగావాట్లు
5) వేంపల్లి : అన్నమయ్య జిల్లా 800,మేగావాట్లు
6) యాగంటి : నంద్యాల జిల్లా1000 మేగావాట్లు
7) నాగార్జునసాగర్ : ప్రకాశం జిల్లా 1200 మేగావాట్లు
మొత్తం ఆంధ్రప్రదేశ్లో 7700 మేగావాట్లు ఉత్పత్తి చేసేందుకు అధానితో ఒప్పందం చేసుకున్నారు,హైడ్రో పవర్ ప్రాజెక్టులు వృధాగా సముద్రంలో కలసిపోయే నీటితో పవర్ ఉత్పత్తి చేస్తామని ఎవరిని ఇబ్బందులు కలిగించ బోమని గిరిజనులకు ఆయకట్టు రైతులను నమ్మించి మోసం చేస్తున్నారు,ఇప్పటికే అడ్జస్టింగ్ ఆయకట్టుకు, రైతులకు ఉపయోగపడే నీటిని లిఫ్ట్ ద్వారా ఎత్తయిన ప్రదేశంలో మరో ప్రాజెక్ట్ ను నిర్మించి ఆ నీటిని కిందకు వదిలి పవర్ ఉత్పత్తి చేసేందుకే ఈ ఏర్పాట్లు అన్ని,చేస్తున్నారు అన్ని మెగావాట్ల ఉత్పత్తికి రైతులకు వెళుతున్న నీటిని గాని తీసుకుంటే రైతుకు ఒక్క చుక్క కూడా వెళ్లకుండా సైక్లింగ్ చేస్తూనే ఉంటారు,ఉదాహరణకు రైవాడ రిజర్వాయరునే తీసుకుంటే రైవాడ రిజర్వాయర్ ను అప్పటి కరువు ప్రాంతాలను ద్రుష్టి లో పెట్టుకోని నిర్మూలించేందుకు రైతుల అవసరం తీర్చేందుకు 1970 దశకంలో ప్రాజెక్టును నిర్మించారు ప్రతిపాదిత 20 వేల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకోని ప్రాజెక్టు నిర్మాణం జరిగింది,కానీ విశాఖ తాగునీరు పారిశ్రామిక అవసరాల కోసం రైవాడ నీరు తరలించడంతో ప్రతి ఏడాది చివరి భూముల వరకు నీరు అందక ప్రతిసారి రైతులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. రైవాడ నీరు రైతులకే పూర్తిస్థాయిలో నీరు అందక పోవడంతో రైతులు ప్రతి ఏటా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు మరి కొంత మంది రైవాడ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకోని అదికారం పోందారు కాని నీళ్లు రైతులకే అంకితం అన్నమాట నెర వేరాలెదు రైవాడ నిర్మిస్తున్నప్పుడే ప్రతిపాదిత 20 వేల ఎకరాలకే కాకుండా,మరో ఆరు వేలు అదనపు ఆయకట్టుకు ఎకరాలకు సాగు నీరు అందిస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు హామీ ఇచ్చారు,ఆ,అధనపు ఆయకట్టు కోసం వేపాడ,కె కోటపాడు దేవరాపల్లి మండలాలకు చేందిన రైతులు నేటికీ,ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఇప్పటికే రైతులకు చాలీచాలని నీటితో ఉన్న రైవాడను అధానీ కబ్జాచేస్తే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్న రైతుల్లో మొదలైయింది!
అనకాపల్లి జిల్లాలో ఉన్న రైవాడ రిజర్వాయరుకు ఇన్ ప్లోగా వచ్చే శారదానది పై చింతలపూడి పంచాయతీ బలిపురం వద్ద అనకట్టు నిర్మించి లిఫ్ట్ లు పెట్టి విజయనగరం జిల్లా వీలుపర్తి రెవిన్యూ మారికగెడ్డ పై నుంచి కరకవలస పంచాయతీ పాత మారిక, కొత్త మారిక గ్రామాల మధ్య కొత్తగా రిజర్వాయర్ నిర్మించి రైవాడ FRL వద్ద నుండి లిఫ్ట్ ద్వారా 1000 మేగావాట్లు ఉత్పత్తికి అవసరమయ్యే నీటిని స్టోర్ చేయాడానికి సిద్దపడుతున్నారు ఈ రిజర్వాయరుకు హైడ్రో పవర్ ప్లాంటులు లిప్ట్లుపెడితే అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి,సమ్మెద,కోరాడ కొత్తూరు బోడిగరువు నేరేళ్ళపూడి తోపాటు అనేక గిరిజన గ్రామాలన్నీ సర్వనాశన మౌవుతాయి.
లిఫ్ట్ ద్వారా నిర్మించ తలపెట్టిన విజయనగరం జిల్లా కొత్త మారిక పాత మారిక గ్రామాలు, అక్కడ సాగు భూములు ఆధాని పరమౌవుతాయి వేపాడ మండలానికి మారిక గెడ్డ ద్యారావచ్చే వీలుపర్తి తూము చెరువు లోకి వచ్చే మారికి గెడ్డ నీరు కూడా బంద్ అవడంతో వేపాడ మండలంలొని ఆరు వేల ఎకరాల భూమికి నీరు రాక పంట పొలాలు బీడు భూములుగా మారుతాయి రైవాడ రిజర్వాయర్ ద్వారా సాగుఅవుతున్న రైతులకు ఇక పై చుక్కనీరు కూడా రాదు రైవాడ నీరు రైతుల హక్కు అనే నినాదం కాస్త ఆధాని హక్కుగా మారుతుంది,రైవాడ రిజర్వాయర్ లోకి వచ్చే శారదా నది నీటి ప్రవాహం అంతంత మాత్రంగానే వస్తుంది గడచిన 20 ఏళ్లలో FRL లేవుల్స్ దాటిన సందర్బలు లేవు ఎప్పుడో తుఫాన్లు వచ్చినప్పడు తప్ప, అటు శారదా రిజర్వాయర్ లోకి, ఇటు తాటిపూడి రిజర్వాయర్ లోకి అనంతగిరి ఆరుకు కొండల పరివాహక ప్రాంతాలలో ఉన్న బాక్సైట్ ఖనిజ సంపద ఉన్నందున నీటి ప్రవాహం ఉంటుంది,ప్రభుత్వం బాక్సియిట్ తవ్వాకాలకు అనుమతినిస్తే అటు రైవాడ రిజర్వాయర్, ఇటు తాటిపూడి రిజర్వాయర్ లలో ఒక చుక్క నీరు కూడా రాదు అప్పుడు ఆ రిజర్వాయర్ లు ఆడుదాం ఆంధ్రా గ్రౌండ్స్ గా ఆటలకే పనికి వస్తాయి ఈ నేపథ్యంలో ఈలిఫ్టు ఆధారిత హైడ్రో పవర్ ప్లాంట్లుతో అటు రైతాంగం,ఇటు గిరిజన ప్రాంతం నాశన మోతుంది గిరిజనులు ఇప్పటికే ఉద్యమబాట పట్టారు.
అదానీ సిబ్బంది ప్రస్తుతం నూతన టెక్నాలజీ కలిగిన యంత్రాలతో సర్వే చేపాడుతున్న నేపథ్యంలో సిపిఎం గిరిజన సంఘాలు అండతో స్థానిక గిరిజనలు అడ్డు కుంటున్నారు అటు రైతులు,ఇటు గిరిజనులు హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమౌవుతున్నారు ఇంత జరుగుతున్న అదికార పార్టీ నాయకులు మాత్రం నోరు మేదపడం లేదన్నారు ఉపముఖ్యమంత్రి సోంతమండలో ఇంత జరుగుతున్న కనీసం స్పందించకపోవడం,శోచనీయమన్నారు రైవాడ నీళ్ళు రైతులుకా అదానికా తేల్చవలసింది ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలు నాయుడేనని! వెంకన్న ప్రకటనలో స్పష్టం చేసారు,

➡️