కోర్టు వివాదంలో దేవాదాయభూములు

Jun 1,2024 10:41 #anakapalli
  • అన్యాక్రాంతం అవ్వకుండా వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్

ప్రజాశక్తి-దేవరాపల్లి : దేవరాపల్లి మండలంలోని మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 115లో 23, 15 సేంట్లు కోట్లాది రూపాయలు విలువ చేసే దేవదాయ భూములపై కవిత అగ్రిపామ్ యాజమాన్యం  హైకోర్టును అశ్రమించడం జరిందని తెలిపారు. దేవదాయశాఖ అధికారులు ఈ భూముల్లో వెంటనే బోర్డులు ఏర్పాటు చేసి భూములకు రక్షణ కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ భూములు పూర్వం మారేపల్లి గ్రామానికి చెందిన అవుగడ్డ సఖూరి నాయుడు శ్రీ రాములు వారి దేవస్థానంకు దానం చేయగా 1956 లో సేటిల్ మేంటు ఫేయిర్ ఆడగంగ్ లో శ్రీరాములు వారి పేరు నమోదు అయ్యిందని తెలిపారు. అదే సేటిల్ మేంటు ఫేయిర్ ఆడంగ్ ల్లో రెండవ పేరును అల్లు గౌరునాయుడు పేరు వ్రాసెసుకోని తారువా గ్రామానికి చేందిన అప్పటికే శీస్థులకు దున్ను కుంటున్న రైతులు 1999లో మున్సిపల్ సీవిల్ జడ్జి కోర్టులో కేసువేయడం జరిందన్నారు కోర్టు ఇండోమేంటుకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిందన్నారు. అయినప్పటికీ రైతులు తప్పుడు రికార్డులు స్రుష్టించి కవిత అగ్రిపామ్ యాజమాన్యంకు అమ్మకాలు చేసారని తెలిపారు. దీనిపై సిపిఎం పార్టీ గత రెండు సంవత్సరాలనుండి దశలవారీగా పోరాటం చేయడంతో దేవదాయ శాఖ అధికారులు స్పందించి కవిత అగ్రిపామ్ యాజమాన్యం వెంచరి వేసిన భూములు అమ్మకాలు కోనుగోలు చేల్లుబాటు కావని ఇవి దేవదాయశాఖకు చేందిన భూములని నిలుపుదల చేయడం జరిగిందన్నారు. దీనిపై కవిత అగ్రిపామ్ యాజమాన్యం తేదీ 10/10/2023 న (కేసు నెంబరు 26804) గౌవర హైకోర్టులో పీల్ వేయడం జరిందని తెలిపారు. దీనిపై దేవదాయ శాఖ అదికారులు కూడా కోర్టులో కౌంటర్ వేయడం జరిందని ఇప్పటికే పలు వాయిదాలు కోర్టు వేసిందని తెలిపారు. మరలా జూలై 1 వ తేదీన వాయిదా ఉందన్నారు తుది తీర్పు వచ్చేంత వరకు ఈ భూములు దేవదాయ శాఖ స్వాధీనంలో బోర్డులు ఎర్పాటు చేసి భూములు అన్యాక్రాంతం అవ్వకుండా రక్షణ కల్పించాలని వెంకన్న అదికారులను కోరారు.

➡️