రిజర్వుడ్ ఫారెస్టులో హైడ్రోపవర్ ప్లాంటా?

Jul 1,2024 15:19 #anakapalle district
  • అదాని కంపినీ రహస్య సర్వే
  • కోనాం ప్రాజెక్టుకు ముప్పు

ప్రజాశక్తి-దేవరాపల్లి: సరియా జలపాతం ప్రాంతంలోని రీజర్వ పారెస్టులో హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం అదాని కంపెనీకి చెందిన కోలకొత్తాకు చెందిన కొంతమంది చేపట్టిన రహస్య సర్వేను వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు. సోమవారం వారు సరియా ప్రాంతంలోని హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రహస్యంగా సర్వే చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం సరియా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. ఈప్రాంతంలో హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం జరిగితే దేవరాపల్లి మండలంలోని వాలాబు చేశారు. ప్రాంతంలోని సగం గ్రామాలకు, అనంతగిరి మండలంలోని కోన్ని గ్రామాలతో పాటు చీడికాడ మండలం కోనాం ప్రాజెక్టుకు గల ఆయకట్టు దార్లుకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడుందని వారు తెలిపారు. ఈ ప్రాంతంలోని గిరిజనులను మోసం చేసి పారెస్టు అధికారులు కళ్ళుగప్పి రహస్యంగా సర్వేలు నిర్వహిస్తూన్నారని తెలిపారు. ఇటువంటి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా చింతలపూడి పంచాయతీలో పవర్ ప్లాంట్ కోసం పనులు ప్రారంబించగా గిరిజనులు ముక్త కంఠంతో వ్యతిరేఖించడం జరిగిందన్నారు. ఇక్కడ కూడా గిరిజనులు అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సర్వేలు వెంటనే నిలుపుదల చేయకపోతే ప్రత్యక్ష ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కోనాం ప్రాజెక్టుకు పైనుండి అత్యంత కీలకమైన బోడ్డెరు జీవనదని తెలిపారు. ఈనదిపై పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే వేలాది ఎకారాలకు చేందిన కోనాం ఆయకట్టు రైతులు భూములు బీడీ భూములుగా మారడంతో పాటు ప్రసాంతగా ఉన్న ఈప్రాంతంలో గిరిజన గ్రామాలు కాలి చేయవలసి వస్తుందని తెలిపారు. ఈ జీవ నదిపై అదాని కంపెనీ కన్ను పడిందన్నారు. రీజర్వ పారెస్టులో సర్వే చేయాడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు రహస్యంగా సర్వే నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతంలోని హైడ్రోపవర్ ప్లాంట్ కు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు జర్రా రామారాజు, జర్రా రాజుబాబు, జర్రా అప్పలరాజు, శిరగం లక్షమణరావు, రంగిసింగిదేముడు, తదితరులు పాల్గొన్నారు.

➡️