మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు శిక్షణ

May 29,2024 15:54 #anakapalle district

ప్రజాశక్తి – బుచ్చయ్య పేట (అనకాపల్లి జిల్లా) : నాణ్యత గల మరియు రుచికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా అందరూ పని చేయాలని టిఎంఎఫ్ కోఆర్డినేటర్ పి.అచ్యుతరావు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిబ్బడిలో, మండల విద్యాశాఖధికారి బుద్ధ కాశీ విశశ్వరరావు అధ్యక్షతన మండలంలో గల అన్ని పాఠశాలల భోజన నిర్వాహకులుకు మధ్యాహ్న భోజన తయారీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుండి శనివారం వరకు మెనూ ప్రకారం అందజేయవలసిన పోషకాహారం గురించి వివరించారు. కార్యక్రమం లో గునూరు వరలక్ష్మి రిసోర్స్ పర్సన్ గా వ్యవహారించారు. బి. ఏ. రాజు, సీఆర్ పి శ్రీను, సాయి, వివిధ పాఠశాల లకు చెందిన భోజన పథకం నిర్వాహకులు పాల్గొన్నారు.

➡️