అధిక ఇంధనం వినియోగంతో పర్యావరణానికి ప్రమాదం

వరంగల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఎన్‌ఐటి కీనోట్‌ స్పీకర్‌ ఎ.వీరేశ్‌ బాబును సత్కరిస్తున్న జెఎన్‌టియు ప్రిన్సిపల్‌ సత్యనారాయణ

      అనంతపురం : అధిక ఇంధన వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు విడుదల అయ్యి పర్యావరనానికి ప్రమాదం ఏర్పడుతుందని అనంతపురం జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌వి.సత్యనారాయణ తెలియజేశారు. సోమవారం నాడు జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల మెకానికల్‌ సెమినార్‌ హాల్‌లో ‘టూవర్డ్స్‌ నెట్‌ జీరో ఏమిసెన్స్‌ ‘ అనే అంశంపై టెక్నికల్‌ వర్క్‌ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ మాట్లాడుతూ అధిక ఇంధన వినియోగంతో పర్యావరణానికి కలిగే నష్టాలు, కర్భన ఉద్గారాల దుష్‌పరిణామాలను తెలుసుకోవాలన్నారు. వాతావరణ సమతుల్యత ఏర్పడితే కరువు, అడవుల్లో మంటలు ఏర్పడుతాయన్నారు. శీతోష్ణస్థితి మార్పుల వల్ల పంటల దిగుబడి తగ్గుతుందన్నారు. సముద్ర మట్టాలు పెరగడంతో తీరప్రాంతాల మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఎన్‌ఐటి కీనోట్‌ స్పీకర్‌ ఎ.వీరేశ్‌ బాబు, జెఎన్‌టియు వైస్‌ ప్రిన్సిపాల్‌ ఇ.అరుణ కాంతి, మెకానికల్‌ విభాగాధిపతి డాక్టర్‌ కళ్యాణి రాధ, డాక్టర్‌ బి.ఓంప్రకాష్‌, డా||డిఆర్‌. శ్రీనివాసన్‌, డాక్టర్‌ కెఎఫ్‌.భారతి పాల్గొన్నారు.

➡️