జర్నలిస్ట్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి : సిపిఎం

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

            అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం ఫొటో జర్నలిస్ట్‌ శ్రీక్రిష్ణపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేసి శిక్షించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. జర్నలిస్ట్‌పై దాడిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వద్ద సిపిఎం నాయకులు, కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.శ్రీనివాసులు, నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి మాట్లాడుతూ ఫొటో జర్నలిస్ట్‌ క్రిష్ణపై దాడి ప్రజాస్వామ్యంపై చేసిన దాడిగా పరిగనిస్తున్నట్లు తెలిపారు. తన వత్తిలో భాగంగా బహిరంగ సభ దశ్యాలను కవర్‌ చేయడానికి వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానష చర్యని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ వైరుధ్యాలు ఉంటే పార్టీలతో పోరాడాలే తప్ప ఇలా వత్తి ధర్మంలో ఉన్నటువంటి విలేకరులపై ప్రతాపం చూపడం సరికాదన్నారు. తక్షణం పోలీసులు స్పందించి దాడి చేసిన నిందితులను శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు క్రిష్ణమూర్తి, చంద్రశేఖర్‌ రెడ్డి, సూరి, ప్రకాష్‌, వెంకటనారాయణ, ముస్కీన్‌, జీవ, మారుతి, నాగరాజు, బాలకష్ణ, రమేష్‌, పరమేశు, సిద్ధు, భీమేష్‌, రాజు, లాలెమ్మ, చిదంబరమ్మ, మాబున్నీ తదితరులు పాల్గొన్నారు.

దాడిపై దుష్ప్రచారాన్ని ఆపండి : సిపిఎం

         రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభలో కొందరు అల్లరి మూకలు ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ కష్ణపై చేసిన దాడిని తప్పుదోవ పట్టించేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని సిపిఎం జిల్లాకమిటీ కోరింది. ఈ మేరకు సోమవారం నాడు వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహ్మయ్యకు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ ఓ లేఖను రాశారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ వత్తిరీత్యా ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న కృష్ణ అత్యంత సౌమ్యుడన్నారు. అలాంటి వ్యక్తి మీద దాడి జరిగితే దాన్ని ఖండించి, అల్లరి మూఖలను నియంత్రించాల్సిందిపోయి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఫొటోగ్రాఫర్‌ కృష్ణ మహిళల చైన్‌ లాగాడని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వైసిపి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడాన్ని సిపిఎం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజల విశ్వాసాన్ని పొందవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసిన వారిని గుర్తించి శిక్షించాల్సిన బాధ్యత వైసిపి ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకు భిన్నంగా దాడిని తప్పుదోవ పట్టించేలా సోషల్‌మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు.

➡️