జిల్లా గ్రంథాలయంలో ఆధునిక స్టడీ హాల్‌ ప్రారంభం

Dec 22,2023 23:05

ఆధునిక స్టడీ హాల్‌ను ప్రారంభిస్తున్న జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, ఎల్‌ఎం.ఉమా తదితరులు

   అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఆధునిక స్టడీ హాల్‌ విభాగాన్ని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరజమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ఎల్‌ఎం.ఉమామోహన్‌రెడ్డి, కార్యదర్శి పి.రమాతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజమ్మ మాట్లాడుతూ గ్రంథాలయంలో స్టడీహాల్‌ విద్యార్థులు, పోటీ పరీక్షలకు చదివే అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. స్టడీ మెటిరియల్‌ అందుబాటులో పెట్టడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి ఎల్‌ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్‌ సుబ్బరత్నమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

➡️