టిడిపికి పెరిగిన ప్రజాదరణ

విలేకరులతో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

 

ప్రజాశక్తి-రాయదుర్గం

రోజురోజుకూ తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఎనలేని ఆదరణ లభిస్తోందని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం పట్టణంలోని 5వ వార్డులో ‘బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతోపాటు టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌రెడ్డి ఆరాచకపాలనతో అన్నివర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. నాలుగున్నరేళ్లలో ఆరుసార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచడంతో సామాన్యుల జీవనాలు దుర్భరంగా మారాయన్నారు. నవరత్నాల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి, గెలిచిన జగన్‌ అరకొర సంక్షేమ పథకాలతో దారుణంగా మోసం చేస్తున్నాడన్నారు. అమాయక ప్రజల్ని మరోసారి మోసగించడానికి ‘రాష్ట్రానికి మళ్లీ జగన్‌ కావాలా?’ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మండల కన్వీనర్‌ హనుమంతురెడ్డి, 5వ వార్డు ఇన్‌ఛార్జి మహబూబ్‌బాషా, 5వ వార్డు బి.ఎల్‌.ఎ పాండు, కౌన్సిలర్‌ ప్రశాంతి, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ వెంకటేశులు, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం, మైనార్టీ సెల్‌ జమీల్‌ఖాన్‌, ప్రధాన కార్యదర్శి ఇనాయత్‌ బాషా, మాజీ కౌన్సిలర్‌ సుమలత, ధనార్జున, వెంకటేశులు, ఎస్సీ సెల్‌ మల్లి, అంజి, తిప్పేస్వామి, రవి, బసవరాజు, శివ, వెంకటేశులు, యల్లప్ప, ప్రహ్లాద, తదితరులు పాల్గొన్నారు.

➡️