టిడిపితోనే రాయదుర్గం అభివృద్ధి

టిడిపితోనే రాయదుర్గం అభివృద్ధి

పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పుతున్న కాలవ శ్రీనివాసులు

ప్రజాశక్తి-రాయదుర్గం

తెలుగుదేశం పార్టీతోనే రాయదుర్గం అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం పట్టణంలోని పలువురు యువకులు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా వెంకటస్వామినాయుడు అధ్వర్యంలో పార్టీలో చేరిన 40 మంది యువకులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టిడిపికి 15వేల మెజారిటీ తగ్గకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా 2014-19 మధ్యకాలంలో తాను రాయదుర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. పట్టణ రూపురేఖలు మార్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. ఇక్కడి ప్రజల పాతికేళ్ల కలను పట్టణ రహదారి విస్తరణ ద్వారా నెరవేర్చామని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో ముఖ్యంగా రాయదుర్గంలో వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోలేక పోతున్నారన్నారు. సంఘ విద్రోహ శక్తులు, దందాలకు పాల్పడేవారిని తానేప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు ప్రశాంతి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెంకటేషులు, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్‌బాషా, ఇనాయత్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు.

➡️