మృతుని కుటుంబన్ని పరామర్శించిన మాజీ మంత్రి

Jun 28,2024 12:25 #Anantapuram District

ప్రజాశక్తి-రొద్దం : మండలంలోని ఎల్ జి బి నగర్ కు చెందిన వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతూ శ్రీరామ రెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి & పెనుకొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కే.వి.ఉషాశ్రీచరణ్, శుక్రవారం వారి స్వగ్రామంకు వెళ్లి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చి శ్రీ రామి రెడ్డి కుటుంబంకు అన్ని విధాలుగా అండగా వుంటామని భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో తురకలపట్నం సర్పంచ్ నరేంద్ర రెడ్డి, సి నారాయణ రెడ్డి, ఎన్ నారాయణ రెడ్డి, లక్ష్మినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️