కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

Jun 28,2024 12:53 #Anantapuram District

ప్రజాశక్తి-గుంతకల్లు రూరల్ : అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని దంచర్ల గ్రామానికి చెందిన రేణుక (20) అనే యువతి సీలింగ్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు మృతురాలు కొన్ని సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతుందన్నారు. ఆమె తల్లిదండ్రులు చాలా చోట్ల చూపించిన నయం కాలేదన్నారు. నెలసరి వచ్చేసరికి తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బందులు పడేదని తెలిపారు. గురువారం రాత్రి ఇంటిలో అందరూ నిద్ర పోయిన తర్వాత ఆమె సీలింగ్ కొండికి చీరతో ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసుకునేసరికి ఆమె అప్పటికే మృతి చెందిందన్నారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️