ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తున్న ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ మధుసూదన్‌రెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం

ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, చేస్తున్న అభివృద్ధి వివరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉందని సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంఘం జిల్లా ప్రెసిడెంట్‌ ఎ.హొన్నూరప్ప సూచించారు. సోమవారం నగరంలోని ఎస్‌వి డిగ్రీ, పిజి కళాశాల జాతీయ సేవాసమితి యూనిట్‌ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు పౌరులకు ఏదైనా ప్రభుత్వ పనిని అధికారికంగా తనిఖీ చేయడానికి, ఉపయోగించిన మెటీరియల్‌ నమూనాను తీసుకునే హక్కు, అధికారం ఉందన్నారు. సమాచార హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1) ప్రకారం ప్రథమిక హక్కుల్లో భాగం అన్నారు. కళాశాల ఛైర్మన్‌ సి.సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు ద్వారా దేశంలోని ఏ పౌరుడైనా ప్రభుత్వ అధికారం నుంచి కోరే అధికారం ఉందన్నారు. కావున పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్‌ఛైర్మన్‌ సి.చక్రధర్‌రెడ్డి, ప్రన్సిపల్‌ వై.మధుసూదన్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ టి.శ్రీనివాసులు, ఎఒ శ్రీనాథ్‌, నబిరసూల్‌, గౌరవాధ్యక్షులు, ఎంఎస్‌ఎస్‌ అధికారులు జి.ఆనంద్‌బాబు, ఎస్‌.పురుషోత్తం, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️