మహాధర్నాను జయప్రదం చేయండి

పోస్టర్లను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

 

ప్రజాశక్తి-ఉరవకొండ

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగం, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27, 28వ తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పిఎం మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ముఖ్యమంత్రి జగన్‌ తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయే విధంగా కేంద్రం చట్టాలను తీసుకొస్తే 11 రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. అయితే సిఎం జగన్‌ మాత్రం ఒప్పుకోవడం బాధాకరమన్నారు. ఇందులో రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టే ప్రక్రియకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఆయా విధానాలను నిరసిస్తూ మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మధుసూదన్‌, జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి, రైతుసంఘం నాయకులు మురళి, రవికుమార్‌, వీరాంజనేయులు, సీనప్ప, సిద్ధప్ప, తదితరులు పాల్గొన్నారు.బుక్కరాయసముద్రం : దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాల పిలుపుమేరకు విజయవాడలో 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న మహాధర్నాకు జిల్లా నుంచి వందలాదిగా కదిలిరావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈమేరకు మండల కేంద్రంలో వ్య.కా.సం, సిఐటియు, రైతుసంఘాల ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించినక కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి.శ్రీనివాసులు, మండల కార్యదర్శి నాగేంద్రకుమార్‌, నాగలింగమయ్య, రైతుసంఘం జిల్లా నాయకులు పుల్లయ్య, నారాయణస్వామి, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️