మహిళలతో మాట్లాడుతున్న తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డి

మహిళలతో మాట్లాడుతున్న తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డి

టిడిపితోనే ప్రజల సంక్షేమం

ప్రజాశక్తి-పెద్దవడుగూరు

ప్రజలందరికీ సంక్షేమం అందాలం టే టిడిపితోనే సాధ్యమని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. యువచైతన్య రథం బస్సుయాత్రలో భాగంగా సోమవారం మండలంలోని బుర్నాకుంట, బందార్లపల్లి, ముప్పాలగుత్తి, మల్లేనిపల్లి, భీమునిపల్లి గ్రామా ల్లో బస్సుయాత్ర సాగింది. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు నీరాజనం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమ ం రావాలంటే మళ్లీ టిడిపికే పట్టం కట్టాలన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే మండలంలోని అన్ని పంచాయతీల రూపురేఖలను మార్చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ కొండూరు కేశవరెడ్డి, ఉపాధ్యక్షుడు ఆవులాంపల్లి కేశవరెడ్డి, బాలిరెడ్డి, దివాకరరెడ్డి, గంగరాజు, కొండూరు హరినాథరెడ్డి, వెంకట్రామిరెడ్డి, చిరంజీవులు, రవిశేఖర్‌రెడ్డి, నగేష్‌, నాగరాజు, ముత్యాలు, సంజీవులు, రాజు, గంగాధర్‌, రంగస్వామి, రమేష్‌, సాంబ, తదితరులు పాల్గొన్నారు.

➡️