భక్తి శ్రద్ధలతో బక్రీద్

Jun 17,2024 10:18 #Anantapuram District

ప్రజాశక్తి-రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు ఈద్గా నందు సోమవారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈదుల్ అజ్హా బక్రీద్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ సైఫుల్ల (ఈదుల్-అద్హా) బక్రీద్ యొక్క ప్రాముఖ్యత మరియు హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క త్యాగాల గురించి గుర్తు చేశారు. ప్రవక్త మొహమ్మద్ సల్లలాహు అలైహి వసల్లం ముస్లింలకు ఇచ్చిన సందేశం గురించి వివరించారు.

➡️