భూరక్ష పాసుబుక్కులు దగ్ధం

Jan 4,2024 13:54 #Anantapuram District
cpi protest against on land titling act

ప్రజాశక్తి-పుట్లూరు  : మండల సిపిఐ ఆధ్వర్యంలో గురువారం కందికాపుల సచివాలయం వద్ద భూ రక్ష పాస్ బుక్స్ ప్రతులను దగ్ద0 చేశారు.
పుట్లూరు మండల సిపిఐ కార్యదర్శి డి. పెద్దయ్య మాట్లాడుతూ మన రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫోటో ముద్రించి భూ రక్ష పథకం కింద పట్టాదారుల పాసు పుస్తకాలు రైతులకు అందజేస్తున్నారు. రైతులకు అందజేసిన ఈ- పాస్ పుస్తకాలు నిరుపయోగంగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం పరుస్తున్నారు. గతంలో ఈ పాస్ పుస్తకాలు భూమి అమ్మకాలు, కొనుగోలుకు ,బ్యాంకులో రుణాలు పొందడానికి ఉపయోగపడేవి, ప్రస్తుతం భూ సమగ్ర సర్వే పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు వేసి అనంతరం రూపొందించిన పట్టాదారు పాస్ పుస్తకాలు భూమి రిజిస్ట్రేషన్ కు, తనకా పెట్టుకోవడానికి, రుణాలు పొందడానికి ఏమాత్రం ఉపయోగం లేదు. రీసర్వే నిర్వహణ సందర్భంగా క్షేత్రస్థాయిలో పెద్ద సంఖ్యలో అవకతవకలు జరిగాయని రైతులకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వటం వలన అనేక వివాదాలకు దారితీసి రైతుల మధ్య చిచ్చు పెడుతున్నది. ఈ రిసర్వే వల్ల ఈమధ్య రైతులు ఒకని ఒకరు చంపుకోవడం కూడా జరిగినది. అందుకే కందికాపుల సచివాలయం వద్ద పాస్ పుస్తకాల ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సి పెద్దిరాజు, డి హెచ్ ఎస్ మండల అధ్యక్షులు డి.పెద్దన్న, చేతి వృత్తిదారుల మండల అధ్యక్షులు సి.ఓబులపతి, రైతు వెంకట్ రెడ్డి, పెద్ద కొండయ్య, దేవరాజ్, సూరి, రంగప్ప , వెంకటరమణ, నారాయణ, ధన, తదితరులు పాల్గొన్నారు.

➡️