విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Mar 23,2024 17:05 #Anantapuram District

కమిషనర్

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురము నగరపాలక సంస్థ పరిధిలోని విధ్యుత్ నగర్ రోడ్డు, ఆదర్శ నగర్,శారదా నగర్, ఆర్.టి ఓ ఆఫీస్ రోడ్డు, జె.ఎన్.టి యు రోడ్డు, విజయనగర కాలనీ తదితర ప్రాంతాలలో కమిషనర్ మేఘ స్వరూప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ చాలా ప్రదేశాలలో పారిశుద్యం మెరుగుపరచాలని, ప్రధాన రహదారులు మరియు రోడ్ల పై చెత్త కనిపించకూడదని, పారిశుధ్య పనులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.హమాలీ కాలనీ నందు ఖాళీ ప్రదేశాలలో ఎక్కువ చెత్త వుండడం గమనించి ఇకపై అక్కడ చెత్తను వేయకుండా చర్యలు చేపట్టాలని, అలాగే చెత్తని ఎప్పటికప్పుడు తొలగించేలా ఏర్పాటు చేయాలనీ సంబంధిత పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి సూచించారు. నగర పరిధిలో ఎప్పటికప్పుడు చెత్తను తరలించేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు అయినా ఇంకా ఎక్కడైనా సరే పారిశుద్యం లోపించిన మరియు అపరిశుబ్రముగా ఉన్న నగరపాలక పారిశుధ్య కార్యదర్సులకు లేదా సిబ్బంది కి వెంటనే సమాచారం అందించాలని నగర ప్రజలను కోరారు.

➡️