దూదేకుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

దూదేకుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

దూదేకుల సంఘం నాయకులను సన్మానిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-గుత్తి

నూర్‌బాషా (దూదేకుల) అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ నేతత్వంలోని వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోందని నూర్‌బాషా (దూదేకుల) సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ఎస్‌.బాజీ తెలిపారు. బుధవారం పట్టణంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ డి.వన్నూరుబీ, వైసీపీ పట్టణ కన్వీనర్‌ డి.హుస్సేన్‌ పీరా నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ డి.వన్నురుబీ మాట్లాడుతూ రాష్ట్రంలో దూదేకుల కులానికి సిఎం జగన్‌ పూర్తి న్యాయం చేశారన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో దూదేకుల సామాజిక వర్గానికి ఎలాంటి పదవులు లేవన్నారు. అదే జగన్‌ ప్రభుత్వంలో 2 కార్పొరేషన్‌ ఛైర్మన్లు, ఒక మేయర్‌, 2 మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు, 13 డైరెక్టర్లు, 2 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను కేటాయించారన్నారు. ఇందులో గుత్తి మున్సిపాలిటీ ఉండటం సంతోషకరమన్నారు. రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్‌ సయ్యద్‌ బాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో దశాబ్ధాలుగా దూదేకులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జీవో ఇచ్చిన ఘనత సిఎం జగన్‌కు దక్కుతుందన్నారు. అలాగే తమ పిల్లల సర్టిఫికెట్‌లో ఇండియన్‌ హిందూ దూదేకుల అని ఇవ్వడం వల్ల మైనారిటీ బెనిఫిట్స్‌ కోల్పోయామన్నారు. అయితే ఇండియన్‌ ముస్లిం దూదేకుల సమస్యలను పరిష్కరించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నూర్‌బాషా (దూదేకుల) సంక్షేమ సంఘం మద్దతు ఉంటుందన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మహబూబ్‌బాషా, సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి డి.బాబా కలిసి ఎస్‌ఎస్‌.బాజీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి.షఫీ, డి.షరీఫ్‌, రాష్ట్ర యూత్‌ అధ్యక్షులు మట్టిపాటి బాషా, సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి నసీరుద్దీన్‌, పత్తికొండ అధ్యక్షులు బషీర్‌ అహ్మద్‌, మహిళా అధ్యక్షురాలు పి.షమినా, ఆదోని యూత్‌ అధ్యక్షులు పి.మస్తాన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️