టిడిపిలోకి వలసలు 

Apr 12,2024 15:22 #Anantapuram District

ప్రజాశక్తి-రొద్దం : మండలంలోని తెలుగుదేశం పార్టీ శేషాపురం యువనాయకులు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో బూదిపల్లి గ్రామం నుండి పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి శుక్రవారం చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన సవితమ్మ.బూదిపల్లి గ్రామం నుండి పార్టీలోకి చేరినవారు బాబు, ఆర్ వెంకట్రాముడు, వెంకటేశులు, చలపతి, చౌడప్ప, రామాంజి , ముత్యాలప్ప, రవి, రామకృష్ణప్ప, ఈశ్వర్, గోవిందప్ప జి.ఈశ్వర్, అంజనప్ప, గోవిందప, మహేష్, అనిల్, శివ, వివేక్,చంద్ర,సురేష్ తదితరులు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అదేవిదంగా శేషాపురం గ్రామానికి చెందిన యువనాయకులు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు కోట్ల వెంకటరామిరెడ్డి, అనిల్ రెడ్డి, రామంజినరెడ్డి, శ్రీనివాస రెడ్డి, బోయ ఈశ్వరప్ప వైసీపీ పార్టీ వీడి, సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️