అంబేద్కర్ నగర్ సమస్యలివిగో

Feb 2,2024 11:19 #Anantapuram District
problems in anantapuram

దశాబ్దాలు కావస్తున్న మున్సిపల్ క్వార్టర్స్ కు పట్టాలు ఇవ్వలేదు

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ :  గడప గడపకు అనంత ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అంబేద్కర్ నగర్ లో పర్యటిస్తుండగా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ ప్రజలందరి సమస్యల పైన మున్సిపల్ కార్మికుల సమస్యల ను వివరించారు. అంబేద్కర్ నగర్ ప్రజలు ముఖ్యంగా అందరూ, దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మరీ ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ప్రభుత్వాలు మారుతున్న మున్సిపల్ కార్మికులలో ఏ ఒక్క కార్మికుడికి, కార్మికురాలుకి ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చిన సందర్భం లేదని అన్నారు. ప్రజలందరికీ సేవలందిస్తున్న, అంబేద్కర్ నగర్ స్థానిక మున్సిపల్ కార్మికులకు ఇల్లు ఇళ్ల స్థలాలు దశాబ్దాలు గడుస్తున్నా ఇవ్వటం లేదన్నారు. స్థానిక అంబేద్కర్ నగర్లో స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు, కావస్తున్న మున్సిపల్ క్వార్టర్స్ కు మున్సిపల్ పట్టాలు ఇవ్వలేని పరిస్థితి, నెలకొందనీ అన్నారు. క్వార్టర్స్ కుప్పకూలి ప్రాణ నష్టం కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి,  అలాగే రెగ్యులర్ కార్మికులు , స్థానిక అంబేద్కర్ నగర్లో 130 కుటుంబాలు ఉన్నాయని, మూడు సంవత్సరాలుగా సంవత్సరాలుగా సరే Oడర్ లీవ్ ఇవ్వలేదని చెప్పారు. రెగ్యులర్ కార్మికులకు కూడా తొందరగా సరేOడర్లు లీవ్ ఇప్పించాలని, అలాగే అవుట్సోర్సింగ్ మేస్త్రీలుగా 15, 20, సంవత్సరాలుగా కొనసాగించిన మేస్త్రీలను సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మేస్త్రీలను కార్మికుడిగా కాలువ కంటి చేతికిచ్చి పంపించడం జరిగినది, ముఖ్యంగా మేస్త్రీలు దళితులు బడుగు బలహీన వర్గానికి చెందినవారు వారు ఉన్నత చదువులు చదివిన, చదువుకు విలువ లేని పరిస్థితి, కావున వారి అందర్నీ యధావిధిగా మేస్త్రిగా కొనసాగించాలని తెలియజేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉన్నత అధికారులతో చర్చించి మీ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, నల్లప్ప, ఉపాధ్యక్షులు శశాంద్ర, మహిళా కన్వీనర్ లక్ష్మీనరసమ్మ, జిల్లా కమిటీ సభ్యుడు ఎం ఆదినారాయణ, కమిటీ సభ్యులు, ప్రభాకర్,శ్రీనివాస్, రవి, చిన్న నరసింహులు, మేస్త్రీలు అంబేద్కర్ నగర్ ప్రజలు పాల్గొనడం జరిగినది.

➡️