నగదు స్వాధీనం

అనంతపురంలో స్వాధీనం చేసుకున్న నగదును చూపుతున్న పోలీసులు

         అనంతపురం క్రైం, నార్పల : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎలాంటి పత్రాలూ లేకుండా తీసుకెళ్తున్న నగదును స్వాధీనం చేసుకుని సీజ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు అనంతపురం జిల్లా కేంద్రంలో రూ.9.25 లక్షలు, నార్పలలో రూ.2.84 లక్షలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… అనంతపురం నగర సమీపంలోని ఎన్‌హెచ్‌-44 సమీపంలో ఉన్న రవి పెట్రోల్‌ బంక్‌ వద్ద సిఐ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. ఏపీ 40 బీహెచ్‌ 3333 నెంబర్‌ గల కారును తనిఖీ చేయగా అందులో రూ.9.25 లక్షల నగదును గుర్తించారు. నగదుకు సంంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో సీజ్‌ చేసినట్లు సిఐ తెలిపారు. నార్పల : మండల పరిధిలోని బొందలవాడ బ్రిడ్జి వద్ద బుధవారం నాడు ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి, ఎఫ్‌ఎస్‌టి బృందం రవీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఎటువంటి పత్రాలూ లేకుండా గోపాల్‌,సాంబశివుడు అనే ఇద్దరు వ్యక్తులు రూ.2,84,800 నగదును తీసుకెళ్తుండగా సీజ్‌ చేశారు. నగదుకు సంబంధించి సరైన బిల్లులు, ఆధారాలు చూపితే వెంటనే వారికి అప్పగిస్తామని ఎస్‌ఐ తెలియజేశారు.

➡️