పుట్లూరులో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Mar 29,2024 15:30 #Anantapuram District

ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలోని ఏ.కొండాపురం గ్రామంలో శుక్రవారం టిడిపి అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీయార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నిరుపేదలకు చేపట్టిన పథకాలను వివరించారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు, బాల రంగయ్య, శివశంకర్ రెడ్డి, భాస్కర్ నాయుడు, చంద్ర, ఓబుల నాయుడు, గోవర్ధన్ రాజు, శ్రీనివాసరెడ్డి, యూనిట్ సభ్యులు, నాయకులు, కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.

➡️