స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం

Apr 6,2024 15:34 #Anantapuram District

ప్రజాశక్తి-అనంతపురం : స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం… నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఐపిఎస్ విజ్ఞప్తి చేశారు. గొడవలు, అల్లర్లులేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. ఈరోజు బుక్కరాయసముద్రం మండలం శిద్ధరాంపురం గ్రామంలో కేంద్ర సాయుధ బలగాలచే కవాతు నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల్లో భరోసా కల్పించారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. గొడవలు, అల్లర్లు జోలికెళ్లకుండా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో ఆ పద్ధతి, విధి విధానాలను స్థానిక తహశీల్దార్ హనుమాన్ నాయక్ ద్వారా ప్రజలకు వివరింపజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి శివారెడ్డి, బి.ఎస్.ఎఫ్ డీఎస్పీ ధర్మేంద్ర, బుక్కరాయసముద్రం సి.ఐ వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.

➡️