సంక్షేమం మాకు రెండు కళ్ళు

Jul 1,2024 11:53 #Anantapuram District

ప్రజాశక్తి-కదిరి టౌన్ : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళని ఆ నినాదంతోనే మా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ముందుగా సోమవారం పట్టణంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు హయాంలో వృద్ధులకు 75 రూపాయలు పెన్షన్ల కార్యక్రమం అమలులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. సామాన్యులకు వృద్ధులకు వికలాంగులకు అండగా నిలబడి పెద్దపీట వేసిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 75 రూపాయలు పెన్షన్ 200 చేయడానికి అపసోపహపాలు పడ్డారని 2014 లో టిడిపికి అధికారంలోకి రాగానే 200 రూపాయల పెన్షన్ ను 2000 రూపాయలు పెంచి వారికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపామనీ గుర్తు చేశారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ 2000 పెన్షన్ మొత్తాన్ని 3000 ఇస్తామని హామీ ఇచ్చి వారిని నయవంచనకు గురిచేసి ఐదు సంవత్సరాలు పాటు ఏడాదికి 250 పెంచుతూ అవ్వ తాతలను మోసం చేశారని విమర్శించారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధులు వికలాంగులకు ఇస్తున్న 3000 రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేస్తానని, హామీ ఇచ్చి ఇచ్చిన నాటి నుండి అనగా ఏప్రిల్, మే, జూన్, మూడు నెలలకు సంబంధించి 3000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలు పెంచుతూ ఇంటి వద్దకే తెచ్చి అవ్వ తాతలు, వికలాంగుల కళ్ళలో ఆనందం చూడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు . ఈ సందర్భంగా పెన్షన్లకు ఆద్యుడు వృద్ధుల కష్టాలను స్వయంగా చూసి చలించి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి మొదటిసారిగా వారికి 70, రూపాయల పెన్షన్ అందించి జన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తదనంతరం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, ఆ వార్డు కౌన్సిలర్ సేగు సుధారాణి, పట్టణ ప్రధాన కార్యదర్శి బాబయ్య, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️