ఉత్తమ పురస్కార గ్రహీతలకు అభినందనలు

Jan 27,2024 16:05 #Anantapuram District
wishes to best service awardies

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండల ఎంపీడీవో దివాకర్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సిద్దిరాచర్ల వీఆర్వో మౌనిక లక్ష్మి విద్యాధికారి కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ విష్ణువర్ధన్ రాజారెడ్డి లు జిల్లా కేంద్రమైన అనంతపురంలో శుక్రవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో విధినిర్వహణలో వారి సేవలను గుర్తించి ఉత్తమ ఉద్యోగులుగా జిల్లా కలెక్టర్ గౌతమి చేతుల మీదుగా గౌరవ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వీరిని శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నాగేశ్వరరావు ఎంపీటీసీలు గొల్లపల్లి శంకర్ యాదవ్ పద్మాకర్ రెడ్డి కొప్పూరు హెల్త్ సూపర్వైజర్ శ్రీరాములు పలువురు ప్రజాప్రతినిధులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఎంపీడీవో దివాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు అదేవిధంగా నార్పల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తోటి పోలీస్ సిబ్బంది ఎస్సై కు అభినందనలు తెలిపారు. వీఆర్వో మౌనిక లక్ష్మిను తాసిల్దార్ హరికుమార్ తో పాటు సహచర విఆర్వోలు విఆర్ఏలు రెవెన్యూ సిబ్బంది తదితరులు అభినందించారు. కంప్యూటర్ ఆపరేటర్ విష్ణువర్ధన్ రాజారెడ్డిని విద్యాధికారులు కృష్ణయ్య, నారపరెడ్డి కార్యాలయ సిబ్బంది పలువురు ఉపాధ్యాయులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో విధులు నిర్వహించి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగులుగా పురస్కారం అందుకోవడం నార్పల మండలానికి గర్వకారణం అని వీరి స్ఫూర్తితో మండలంలోని ఇంకా చాలామంది ఉద్యోగులు వారి ఉన్నత సేవలతో ఇటువంటి ఎన్నెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

➡️