వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి

వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు

ప్రజాశక్తి-రాయదుర్గం

వడ్డెర్ల సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని సీతారామాంజనేయ సత్రంలో వడ్డెర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర్ల కోరిక మేరకు రాయదుర్గం నుంచి 75- వీరాపురం గ్రామానికి వెళ్లే రహదారిలో వడ్డెర్ల కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆదర్శ పాఠశాలలో ప్రవేశం, వసతి గృహంలో ప్రవేశం మొదలైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక మెడికల్‌ కళాశాలనైనా తెచ్చారా అని ప్రశ్నించారు. అనంతపురానికి మంజూరైన ఎయిమ్స్‌ కళాశాలను మంగళగిరికి తరలించారన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక 53 వేల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే తిరిగి సీఎంగా జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పొరాళు శిల్ప, నాయకులు మాధవరెడ్డి, గౌని ఉపేంద్రరెడ్డి, సిద్దప్ప, గోవింగ, ఆరవ శివప్ప, గౌని లక్ష్మీకాంతరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, గోవింద, వడ్డే గోవిందప్ప, పైతోట రఘు, జయచంద్ర, మహేష్‌, వివిధ ప్రాంతాలకు చెందిన వడ్డెర్లు పాల్గొన్నారు.

➡️