అభ్యర్థులు అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల్లోకి రావాలి

Mar 10,2024 11:14 #Anantapuram District, #CPM AP
  •  సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ 

ప్రజాశక్తి-రాయదుర్గం : త్వరలో జరగనున్న లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఎన్నికల బడిలో ఉండు అభ్యర్థులు జిల్లా మరియు ప్రాంత అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు రావాలని సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి వి రాంగోపాల్ చెప్పారు. ఆదివారం ఆయన రాయదుర్గంలో టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిలను కలిసి సిపిఎం రూపొందించిన అనంతపురం జిల్లా అభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలు ప్రజా ప్రణాళిక అను పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా రాంభూపాల్ విలేకరులతో మాట్లాడుతూ గత నవంబర్ నెలలో సిపిఎం అనంతపురంలో సదస్సు ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రతిపాదనలను రూపొందించింది అన్నారు జిల్లాలో వ్యవసాయం నీటిపారుదల పారిశ్రామిక అభివృద్ధి విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి సామాజిక తరగతులకు సంబంధించి ఏ అంశాలలో ఏం చర్యలు చేపట్టాలో తీర్మానాలు చేసి వాటిని ప్రభుత్వానికి పంపినట్టు చెప్పారు. లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులను కలిసి వారికి సిపిఎం రూపొందించిన జిల్లా ప్రణాళిక పుస్తకాలను అందజేసి ఎన్నికల్లో గెలిచాక జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు జిల్లాలో వ్యవసాయం అట్టడుగు స్థానంలో ఉందని కేవలం నాలుగు శాతం భూమికి మాత్రమే సాగునీటి వనరులు అందుతున్నట్లు చెప్పారు. పారిశ్రామిక ఉపాధి కల్పన గొర్రెలు మేకల పెంపకం గార్మెంట్ గ్రానైట్ పరిశ్రమల్లో విద్యుత్ చార్జీలు ముడి సరుకులు ధరలు పెరగడం దీంతో పరిశ్రమలు మూతబడిపోయి ప్రజలు ఉపాధి ఉద్యోగ అవకాశాలపై వలసలు వెళ్లే దుస్థితి నెలపొందన్నారు జిల్లాలో వ్యవసాయ రంగం నీటిపారుదల అభివృద్ధికి నిర్దిష్ట ప్రతిపాదనలు చేశామన్నారు హంద్రీనీవా తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ బిటి ప్రాజెక్టు ఎత్తిపోతల మొదలైన పనులను ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసేలా ప్రజల్లో అభ్యర్థులు స్పష్టమైన హామీని ఇవ్వాలని కోరాయమన్నారు. అలా చేయగలిగిన అభ్యర్థుల పట్ల ప్రజలు ఎన్నికలలో ఓటు వేసి గెలిపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బాల రంగయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్, సిపిఎం సీనియర్ నాయకులు ఎన్ నాగరాజు జిల్లా కమిటీ సభ్యులు బి మల్లికార్జున, పట్టణ సహాయ కార్యదర్శి జి మధు, డి హీ రెహల్ మండల కార్యదర్శి ఎన్ లోకేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎం మల్లికార్జున, స్థానిక పార్టీ నాయకులు రమేష్, కృష్ణ నాయక్, అంజి, తిమ్మరాజు, కనేకల్ మండల కార్యదర్శి కోరి నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ తదితరులు పాల్గొన్నారు.

➡️