నార్పలలో వైసిపి ప్రచారం

Mar 13,2024 13:25 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికీ, కుల, మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పథకాలు ఇలానే కొనసాగలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ “ఫ్యాన్” గుర్తుకు ఓటు వేయాలని వీరాంజనేయులు, సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రమైన నార్పలలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక సుల్తాన్ పేటలోని వైస్సార్ విగ్రనికి పూల మాలలు వేసి పాత బస్టాండ్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం పలు కాలనీలలో పర్యటించి వైసిపి నాయకులను మద్దతుదారులను కలిశారు. అనంతరం దుగుమర్రి, నిలితొట్టిపల్లి, తుంపెర, నర్సాపురం, రంగాపురం, జంగంరెడ్డిపల్లి, ఎస్ టి కాలనీ పర్యటించారు గ్రామాల్లో స్థానికులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇంటింటికీ వెళ్లి పలకరిస్తూ, ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జగనన్న ప్రభుత్వంలో మేలుని వివరించారు. రానున్న ఎన్నికల్లో “ఫ్యాన్” గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా సలహాదారు అలూరు సాంబశివా రెడ్డి. ఎంఈ ఎంఎస్ రాష్ట్ర డైరెక్టర్ రఘునాథ రెడ్డి, ఎంపీపీ నాగేశ్వరరావు, సింగల్ విండో చైర్మన్ లోకనాథరెడ్డి, వైసీపీ నాయకులు మొరుసు రమణారెడ్డి, మొరుసు సంజీవరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు శంకర్ యాదవ్ కాటమయ్య పద్మాకర్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కేశవరెడ్డి ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

➡️