ఇవిఎంల వినియోగంపై అవగాహన

May 3,2024 00:18
అవగాహన కల్పిస్తున్న పిఒ

ప్రజాశక్తి -అరకు లోయ:రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఈవీఎంల వినియోగంపై స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో గురువారం రూట్‌ అధికారులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నియోజకవర్గ ఆర్‌.వో, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ అవగాహన కల్పించారు. ఈవీఎంలపై క్షుణ్నంగా తెలుసు కోవాలన్నారు. సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్‌లు సుధాకర్‌, సోమేశ్వరరావు, రూట్‌ ఆఫీసర్లు,ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️