సమ్మె వేతనం చెల్లించాలి : సీఐటీయూ

Jan 31,2024 16:05 #Annamayya district
municipal workers request for strike salary

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : తమ న్యాయమైన డిమాండ్ల కోసం మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మెకు సంబంధించిన వేతనం, పండుగ బోనస్ చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం నూతనంగా బాధ్యతలు తీసుకున్న మునిసిపల్ కమిషనర్ రాంబాబుకు వినతి పత్రం సమర్పించారు. ముందుగా కమిషనర్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ రాంబాబు వెంటనే స్పందించి కార్మికులకు రావలసిన బకాయిలు పెండింగ్ లేకుండా వారికి చెల్లించాలని అధికారులను ఛాంబర్ కు పిలిపించుకొని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సి హెచ్ ఓబయ్య, కార్మికులు లక్ష్మీదేవి, ప్రసాద్, రమణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️