ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బడిబాట

May 27,2024 16:51 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అన్నమయ్య జిల్లా డిఈఓ శివ ప్రకాష్ రెడ్డి మరియు సమ్మిలిత సమన్వయకర్త జనార్ధన్, మండల విద్య శాఖ అధికారులు రఘునాథ్ రాజు మరియు సుబ్బరాయుడు ఆదేశాల మేరకు భవిత కేంద్రం లోని ఉపాధ్యాయినీలు నాగమణి, మాధవిలు దివ్యాంగులైన పిల్లలకు సోమవారం సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా భవిత టీచర్లు మన్నూరు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులైన పిల్లలను గుర్తించి కౌన్సిలింగ్ చేపట్టారు. వారికి భవిత కేంద్రంలో కల్పించే సౌకర్యాలు గురించి వివరించి భవిత కేంద్రానికి చేరుకునే విధంగా దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు వివరించారు.

➡️