సమస్యల పరిష్కారమే ఎజెండా

Mar 15,2024 14:41 #Annamayya district

మండల సర్వసభ్య సమావేశం
ప్రజాశక్తి – బి.కొత్తకోట : సమస్యల పరిష్కారమే ఎజెండాగా తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.శుక్రవారం జరిగిన ఈ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీవో నూర్జహాన్ ప్రారంభించారు. మండల అధ్యక్షులు ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ,జడ్పిటిసి రామచంద్రయ్య యాదవ్,మండల ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్ కుమార్ రెడ్డి, సభా వేదికపై ఆహ్వానించారు. మండల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నట్లు మండల ఎంపిపి లక్ష్మీనరసమ్మ తెలిపారు. తహసిల్దార్ కార్యాలయం నుంచి జూనియర్ అసిస్టెంట్ ఖలీద్ మాట్లాడుతూ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో పనులు చేస్తున్నామని బి.కొత్తకోట మండలంలోని మొత్తం 2000 జగనన్న ఇండ్లు మంజూరయ్యాయి ఈ 2000 ఇండ్లు విఆర్ఓ చేత రిజిస్ట్రేషన్ ప్రక్రియ శరవేగంగా చేపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎంపీడీవో నూర్జహాన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల పూర్తయిన తర్వాత ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే మండల సర్వసభ వేశానికి వచ్చినప్పుడు ప్రతి శాఖకు చెందిన వాళ్లు మూడు రోజులు ముందే నివేదిక సమర్పించాలని తెలిపారు. అలాగే మూడు సర్వసభ సమావేశానికి హాజరుకాని ఎంపీటీసీలపై రాజ్యాంగ బద్ధంగా వారి పదవి నుంచి తొలగిస్తామని వెల్లడించారు. అలాగే విద్యుత్ శాఖ ఏఈ గిరిధర్ మాట్లాడుతూ మండలంలో రెండు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించేందుకు భూమి పూజ ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించామని అందుకు వ్యయం తొమ్మిది కోట్ల వ్యయంతో రెండు విద్యుత్ సబ్ స్టేషన్లకు నిర్మిస్తున్నామని తెలిపారు.అలాగే జగనన్న ఇండ్లు నిర్మాణం పూర్తి అయిన వారికి ఉచితంగా విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్ మాట్లాడుతూ గత సర్వసభ సమావేశానికి ఇప్పటికి వరకు మూడు నెలలు గాను ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 528 టేబుల్ ఇచ్చామని తెలిపారు. అలాగే 2024-2025 గాను ప్రైవేట్ పాఠశాలలో 25% ఒకటో తరగతి ఉచిత ప్రవేశాలు కొరకు దరఖాస్తు చేసుకున్న వారు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్ డి అశ్విని,మండలం ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్ కుమార్ రెడ్డి,హౌసింగ్ ఏఈ లావణ్య,కానిస్టేబుల్ శేఖర, ఎంపీటీసీలు సుబ్బయ్య నాయుడు, రామ సుబ్బారెడ్డి,సర్పంచులు,బడికాయలపల్లి  సర్పంచ్ ఆదెప్ప గౌడ్.వైస్ ఎంపీపీ ఖాదర్ వలీ, ఎంపీడీవో ఏవో థామస్, ఎంపీడీవో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్, ఫాజిల్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️