అప్పన్న హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు

Jun 27,2024 00:19 #Appanna Hundi counting
Appanna Hundi count

 ప్రజాశక్తి-సింహాచలం: సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 28 రోజులకు గాను బుధవారం ఈవో సింగాల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో లెక్కించారు. నగదు రూ.2 కోట్లా 50 లక్షలా, 52 వేలా 507, బంగారం 183 గ్రాముల 200 మిల్లీగ్రాములు, వెండి 15 కిలోల 125 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ రాధ, వివిధ విభాగాల ఎఇఒలు, ఇంజినీరింగ్‌ అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

➡️