జూలై 4 న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి : ఎస్‌ఎఫ్‌ఐ

రేపల్లె టౌన్‌ (బాపట్ల) : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జూలై 4న విద్యాసంస్థలు బంద్‌ ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. బంద్‌ జయప్రదం కోరుతూ జరిగిన సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి ఎం.సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ … దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వల్ల నీట్‌ పేపర్‌ లీకేజి వల్ల వైద్య విద్యార్థులు నష్టపోవటం, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగంలో విద్యాసంస్థలు సుమారు 61 వేల పాఠశాలలను మూసివేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ విద్యారంగం విచ్చలవిడిగా పెరగటం వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. వివిధ యూనివర్సిటీల్లో ప్రశ్నిస్తున్న విద్యార్థులపై పెడుతున్న అక్రమకేసులను ఎత్తివేయాలని అన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రస్థాయిలో విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 4వ తేదీన జరిగే విద్యాసంస్థల బంద్‌ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రేపల్లె డివిజన్‌ ఉపాధ్యక్షులు వై.నవీన్‌ కుమార్‌, సహాయ కార్యదర్శి వై.నాగార్జున, పి.ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️