.ప్రశంసలు సరే.. భరోసా ఏది?

.ప్రశంసలు సరే.. భరోసా ఏది?

కాఫీ రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం

కాఫీ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గెమ్మెలి చిన్నబాబు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ అరకు కాపీ అద్భుతంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్‌ కీ బాత్‌లో ప్రశంసలు కురిపించారని, అంతవరకు బాగానే ఉన్నా, కాఫీ పండించే గిరిజన రైతులకు గిట్టుబాటు ధర, భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనిఆల్‌ ఇండియా కాఫీ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గెమ్మెలి చిన్నబాబు అన్నారు. ఆదివారం ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో విలేకరులతో మాట్లాడుతూ, అరకు ఆర్గానిక్‌ కాపీకి దేశ విదేశాల్లో మంచి ఖ్యాతి ఉన్నప్పటికీ, అది పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు..2018నుంచి ఇప్పటివరకు రూ.60 కోట్లు బకాయి ఉందని, వాటి చెల్లింపులకు చర్యలు చేపట్టడం లేదన్నారు.. రైతులు అనేక ఇబ్బందులు పడి పండిస్తున్న ఆర్గానిక్‌ కాఫీ, మిరియాలు దళారుల బారిన పడి మోసపోతున్నారన్నారు. ఆర్గానిక్‌ కాఫీ పండిస్తున్న రైతులు దళారుల మోసాలకు గురికాకుండా గిట్టుబాటు ధర కల్పించాలంటే ఐటిడిఎ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐటిడిఎ పరిధిలో రెండు లక్ష 30 వేల మంది రైతులు కాపీ,మిరియాలు పంటను సాగు చేస్తున్నారని, వారికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.కాఫీ పంటను సాగుచేస్తున్న రైతులు ప్రమాదవశాత్తు కాఫీ తోటల్లో విష జంతువుల బారినపడి చనిపోతే వారికి ఎటువంటి బీమా సౌకర్యం లేదని, అలాగే వేసవిలో కాలిపోయిన కాఫీ, సిల్వర్‌వోక్‌ పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాఫీకి గిట్టుబాటు ధర ప్రకటించి కాపీ రైతులకు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాపీ రైతు సంఘం నాయకులు చిట్టంనాయక్‌ గురుమూర్తి, పాంగి నానిబాబు, గుత్తుం బుజ్జిబాబు పాల్గొన్నారు.

అరకు కాఫీకి ప్రధాని మోడీ ప్రశంస

ప్రజాశక్తి- పాడేరు : భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న అనేక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆదివారం నిర్వహించిన 111వ మన్‌ కీ బాత్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా అరుకు కాఫీ రుచికి, సువాసనకు గొప్ప ప్రసిద్ధి చెందిందన్నారు. అరుకు కాఫీ గొప్ప శిఖరాలను చేరుకోవడంలో గిరిజన సహకార సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఒకసారి విశాఖపట్నంలో అరుకు కాఫీ రుచి చూశానని గుర్తుచేశారు. అల్లూరి జిల్లాలో 1.50లక్షల మంది గిరిజనులు ఆర్గానిక్‌ కాఫీ సాగు చేస్తున్నారన్నారు. అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న అరుకు గిరిజన కాఫీ, ఢిల్లీలో జరిగిన జి20 సదస్సులో ప్రపంచ దేశాల అధినేతల కితాబులతో మరింత ప్రాచుర్యం పొందందన్నారు.

మాట్లాడుతున్న ఆల్‌ ఇండియా కాఫీ రైతుల సంఘం ఉపాధ్యక్షుడు గెమ్మెలి చిన్నబాబు

➡️