గుండె సంబంధిత సమస్యలపై అవగాహన కార్యక్రమం

Dec 6,2023 14:16 #Annamayya district
awareness on heartache

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయిన పల్లె లోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో గుండె సంబంధిత సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నంద్యాల శాంతిరాం సూపర్ స్పెషాలిటీ అత్యవసర ఔషధ విభాగంహెచ్ ఓ డి డాక్టర్ రఘునాధ రెడ్డిచే ఈ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఎవరికైనా అనుకోని పరిస్థితుల్లో కార్డియాక్ అరెస్ట్ జరిగిన సమయంలో సి పి ఆర్ ఎలా చేయాలో వివరించారు. ముందుగా రోగి యొక్క పల్స్ రేట్ పరీక్ష చేసి, ఆ తర్వాత సిపిఆర్ ను మొదలుపెట్టాలన్నారు. ఛాతిపై ఒత్తిడిని ఎలా పెట్టాలో వివరించారు. ఈ సందర్భంలో 30 సార్లు ఛాతిపై నొక్కిన తర్వాత రెండుసార్లు ముక్కు ద్వారా శ్వాసను నోటితో ఒత్తిడిని తెస్తూ రోగికి అందించాలని తెలిపారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమానాదాలు ఇచ్చారు. వారి సందేహాలు కూడా పూర్తిగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చొప్పా గంగిరెడ్డి, కోశాధికారి అభిషేక్ రెడ్డి, వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.స్వర్ణలత, డాక్టర్ డి.గిర్రా శేఖర్, డాక్టర్ ఎం.ప్రమోద్ కుమార్, డాక్టర్ ఎం.శిరీష, డాక్టర్ ఎం.శ్రవణ్ కుమార్, డాక్టర్ హంస బేగ్, డాక్టర్ మణిదీప్, డాక్టర్ విలీన హాసిని, డాక్టర్ లీలామణి, ఇతర కళాశాలల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️