హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

Mar 5,2024 14:52 #aids, #Kakinada, #raly

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) :  మహారాణి కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరం 5 వ రోజు మంగళవారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మేడిశెట్టి తాతాజీ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ హెచ్ఐవి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు,హెచ్ఐవి బాధితుల పట్ల మానవతా దృక్పథం,హెచ్ఐవి బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు వంటి వాటిపై వివరించారు.హెచ్ఐవి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

➡️