ఘంటసాలకు ఘన నివాళి

Feb 11,2024 23:04

ప్రజాశక్తి – అద్దంకి
అమర గాయకుడు ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా ఘంటసాల గానభారతి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహంవద్ద ఆదివారం ఘనంగా నివాళి అర్పించారు. సంస్థ అద్యక్షులు మోటుపల్లి రామదాసు మాట్లాడుతూ మరణించి అర్ధ శతాబ్దం దాటుతున్నా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న ఘంటసాల చిరస్మరణీయుడని అన్నారు. సినీ విశ్లేషకులు అన్నమనేని వెంకట్రావు మాట్లాడుతూ మూడు దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రసీమను తన అపూర్వ గళంతో, సంగీతంతో ఉర్రూతలూగించిన ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రిటైర్డు ఆర్‌జెడి యు దేవపాలన, శ్రావణ కుమార్, బాలు, పిసిహెచ్ కోటయ్య, చెన్నుపల్లి వెంకటేశ్వర్లు, మస్తాన్, ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం గాయకుడు శేషగిరి ఆధ్వర్యంలో ఘంటసాల పాటల కచేరీ నిర్వహించారు.

➡️