రైలు కింద పడి వ్యక్తి మృతి

May 25,2024 11:40 #bapatla

ప్రజాశక్తి – చీరాల : రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం మండలంలోని విజయనగర కాలనీ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగర కాలనీ గ్రామంలో 7వ లైన్లో నివాసముంటున్న తేళ్ల బుల్లియ్య (35) అనే వ్యక్తి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తున్నారు.

➡️