పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jan 15,2024 00:48

ప్రజాశక్తి – అద్దంకి
స్థానిక శ్రీ ప్రకాశం బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 40ఏల్ల క్రితం చదువుకున్న విద్యార్థినీ, విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఉపాధ్యాయులు కోవి శ్రీనివాసరావు, నాగసూర్ సుబ్బారావు ప్రధాన బాధ్యులుగా గత 12ఏళ్ల క్రితం తొలిసారి కలిశారు. మళ్లీ ఇది రెండోసారి ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఆత్మీయ కలయికలో సుమారు 100మందికిపైగా హాజరయ్యారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, నాగయ్య, ఎస్‌కె పాశ్చామియ, కోటేశ్వరరావు, రోజులీల హాజరయ్యారు. ఘనంగా సన్మానించి, స్పందనలు వినిపించారు. చంద్రమౌళి మాస్టర్ మాట్లాడుతూ తాను కూడా ఈ హైస్కూల్ విద్యార్థినేనని చెప్పారు. ఈ హైస్కూల్లో ఆరేళ్లు చదువుకున్నట్లు, 25ఏళ్లు ఉపాధ్యాయుడుగా చేసినట్లు చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు అందరూ తనకు బిడ్డలతో సమానమేనని అన్నారు. సేవ, స్నేహంతోనే తాను జీవితకాలం ప్రయాణిస్తానని అన్నారు. అంతకు మించి తనకు ఏమీ అవసరం లేదని అన్నారు. నాటి విద్యార్థి మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ మనం గౌరవంగా జీవితంలో అభివృద్ధి చెందాలంటే విద్యార్థి దశలో లాగే జీవితాంతం చదువుతూ, నేర్చుకుంటూనే ఉండాలని అన్నారు. అప్పుడే మనం కానీ, మన బిడ్డలు కాని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. డబ్బుతో విలువలను కొలిచే ప్రస్తుత రోజుల్లో మానవత విలువలను కోల్పోతున్నారని అన్నారు. మనం ఎవరు. ఏ వృత్తిలో ఉన్నా కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రకృతిని, కళలను రెండు కళ్ళుగా భావించినప్పుడే అది మన సామాజిక బాధ్యత కాగలదని అన్నారు. గత 10ఏళ్లకుపైబడి ఈ హై స్కూల్ నందు మెరిట్ విద్యార్థులకు నగదు పారితోషకం తమ బృంధం నుండి అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బత్తుల శ్రీనివాసరావు, అలహరి శ్రీనివాసరావు, బత్తుల రాజశేఖరరెడ్డి, మైనంపాటి రంగారావు, చిన్ని శ్రీనివాసరావు, గట్టుపల్లి రామారావు, కరి శ్రీను, కర్రీ ప్రసాద్, మోటుపల్లి శివరామకృష్ణ ప్రసాద్, పమిడిగటం చంద్రశేఖర్, కరి రవి, పరిటాల పవన్, ముప్పనేని మాధవి లత, జి శైలజ, ఎన్ లక్ష్మీ గాయత్రి, తెలగతోటి మంజుల, పద్మావతి పాల్గొన్నారు.

➡️