దివ్యాంగుల హక్కులపై అవగాన

Dec 3,2023 23:36

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని వక్ఫ్ బోర్డు జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం మస్తాన్ వలి అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ మునిపల్లి కాలేషావలి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు చట్టంలో అనేక రాయితీలు కల్పించిందని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం దివ్యంగ యువకుడు రాము నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ సర్టిఫికెట్ కోసం వెళితే లంచం డిమాండ్ చేశారని అన్నారు. తాము ఎలా ఇవ్వగలమని సభలో ఆవేదన చెందారు. పలువురు దివ్యాంగులు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. దివ్యాంగులకు ఇచ్చే ఫించన్ పెంచాలని కోరారు. జగనన్న కాలనీలో అర్హులైన దివ్యాంగులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ట్రై స్కూటర్లు పంపిణి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పఠాన్ కాలేషావలి, సులేమాన్, ఖాదర్ వలి, రామునాయక్, రహమాన్, బాజీ, రాము పాల్గొన్నారు.

➡️