ఇంకొల్లులో స్వీప్ ప్రోగ్రాం

Mar 30,2024 15:34 #Bapatla District

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ :  రాబోయే సార్వత్రిక ఎన్నికలను పరిష్కరించుకొని ఇంకొల్లు మండలం ఇంకొల్లు గ్రామము లో తహశీల్దారు కార్యాలయం నుండి పంచాయతీ కార్యాలయం వరకు ఓటు యొక్క విలువను తెలిపే నినాదములు చేస్తూ ర్యాలీగా వెళ్లి స్వీప్ (SVEEP) ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది కార్యక్రమములో ఇంకొల్లు తహశీల్దార్ ఎం ప్రమీల మాట్లాడుతూ 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు కావాలని, నమోదు కాబడిన ఓటర్లు అందరూ కూడా పోలింగ్ రోజున తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అదేవిధంగా వికలాంగులు మరియు వృద్ధులకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని మరియు వృద్ధులు మరియు వికలాంగ ఓటర్లకు హోం ఓటు సౌకర్యం కల్పించనున్నట్లు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో రీసర్వే డిటి విజయభాస్కర్ రెడ్డి ఏఎస్ఓ జె పుష్పలత పంచాయతీ సెక్రటరీ కోట నాగయ్య అందరూ వీఆర్వోలు వీఆర్ఏలు విలేజ్ సర్వేయర్లు పాల్గొనడం జరిగినది.

➡️