చంద్రబాబుకు కళాకారుల సంఘీబావం

May 10,2024 00:04 ##tdp #Addanki

ప్రజాశక్తి – అద్దంకి
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కళాకారులు, కళ రంగాన్ని కాపాడుకోవాలంటే కళాకారులు తీసుకొనే నిర్ణయాలే పరిష్కరిస్తాయని తెలుగు నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. కళాకారులకు దారి చూపే చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అందులో కళాకారులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. కళా రత్న తెలుగు నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ స్థానిక నందమూరి కళాపరిషత్ కార్యాలయంలో కళాకారులను ఉద్దేశించి గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా నందమూరి కళాపరిషత్ టీం సభ్యులు గోపాలకృష్ణను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, గోవాడ శ్రీకాంత్, చేబ్రోలు వెంకట సుబ్బయ్య, విప్పర్ల ప్రసాద్, షేక్ మీరావళి, షేక్ బడే సాహెబ్, విస్తర్ల వెంకటేశ్వర్లు, విష్ణు పాల్గొన్నారు.

➡️